ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ఆయన తాజాగా నటించిన లేటెస్ట్ సినిమా ఆచార్య మంచి అంచనాల నడుమ ఇటీవల విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ మరో కీలకపాత్రలో కనిపించారు. చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన ఈ ‘ఆచార్య’ (Acharya )ను కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వం వహించారు. ఆధ్యాత్మికాన్ని నక్సలిజాన్ని మిక్స్ చేసి కొరటాల శివ సరికొత్తగా ఆచార్య సినిమాను తెరకెక్కించారు.